calender_icon.png 1 December, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజ్

01-12-2025 06:04:22 PM

హైదరాబాద్: పట్టాలు ఉండి.. సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజ్ పెట్టామని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసే అవకాశం ఇవ్వలేదని, హిల్ట్ పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే గతంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవో ఇచ్చిందని, ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రామికవేత్తలకు ఇచ్చే జీవో తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నమే హెల్ట్ పాలసీ అన్నారు. ప్రభుత్వ భూమిపై హక్కును బదిలీ చేస్తున్నామనేది అబద్ధమని, సొంత పారిశ్రామిక భూములు ఉన్నవారికి మాత్రమే కన్వర్షన్ అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. హెల్ట్ పాలసీలో ఎస్ఆర్వో రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.