30 August, 2026 | 1:45 PM

మేకల మార్కెట్ వార్షికోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుకు సన్మానం

30-08-2026 12:41 PM

రామగిరి, ఆగస్టు 30(విజయక్రాంతి): రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఆదివారం నిర్వహించిన మేకల మార్కెట్ వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మేకల మార్కెట్ యూనియన్ నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానించారు.

మేకల మార్కెట్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరుకాగా, యూనియన్ నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేకల మార్కెట్ అభివృద్ధి, వ్యాపారుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు వెంట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మేకల మార్కెట్ యూనియన్ నాయకులు ఒర్రె సదయ్య యాదవ్, బనుక అంజి, అలువాల తిరుపతి, బత్తిని ఐలయ్య, ఒర్రె సురేష్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.