30 August, 2026 | 1:03 PM

మారథాన్ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు

30-08-2026 11:57 AM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium) వరకు నిర్వహించిన 21.1 KM మారథాన్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఆయనతో పాటు మంచిర్యాలకు చెందిన మురికి వెంకట్, బుద్దినేని స్వరుణ్, అరుణిమ వెరబెల్లిలు మారథాన్ లో పాల్గొని 21.1 KM మారథాన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగ నిత్యం సాధన చేయాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియాలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.