30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

దత్త నవరాత్రుల్లో మంత్రి శ్రీధర్ బాబు పూజలు

03-12-2025 06:42 PM

కాటారం (విజయక్రాంతి): దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఆయన స్వగ్రామమైన ధన్వాడలో గల దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుదర్శన యాగంలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన సహోదరుడు రాష్ట్ర పిసిసి కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దత్త నవరాత్రులలో పాల్గొన్నారు.

వారి తండ్రి పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు కుటుంబ దైవమైన దత్త దేవాలయంలో ఏటా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దత్త ఆలయం అర్చకులు శ్రీ రాంబట్ల కృష్ణమోహన్ శర్మ, సుమిత్ శర్మ, తిరుమల తిరుపతి వేద పండితులు ఒజ్జల గణేష్ శాస్త్రి అవధాని, ప్రవీణ్ శర్మ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.