25-05-2025 03:06:34 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): సరస్వతి పుష్కరాల్లో భాగంగా సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి(Sri Kaleshwara Mukteswara Swamy)ని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు. త్రివేణి సంగమంలో ఆదివారం పుష్కర స్నానాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) దంపతులు సరస్వతి ఘాట్ లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సరస్వతి ఏక శిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి ఉదయం 11.02 గంటలకు హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.
పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు ఆలయ వేద పండితులు అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అనంతరం శుభానంద దేవి అమ్మవారికి పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించి, శ్వేత వస్త్రం, లడ్డు ప్రసాదం, చక్కెర పొంగలి మరియు సరస్వతి అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు.ఈ సందర్భంగా.రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
ప్రతి రోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమాన్ని గురించి గవర్నర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుష్కర ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 11 రోజుల నుండి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ముగింపు పుష్కరాల వరకు భక్తులకు మరియు పుష్కర లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు.రాష్ట్ర ప్రజలు సరస్వతి పుష్కరాలలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.