12 March, 2026 | 2:23 AM

పారిశుధ్య కార్మికులకు వేతనాలివ్వండి

12-03-2026 12:40 AM

పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెలనెలా వేతనాలు సక్రమంగా అందడం లేదు. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యాదాద్రి జిల్లాలో 421 పంచాయతీలకు  ఉండగా, వాటి పరిధిలో 1,876 మంది మల్టీపర్పస్ వర్కర్లు, 631 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారికి గతేడాది నవంబర్ వరకు మాత్రమే జీతాలు అంతాయి. ఆ తర్వాత నిలిచిపోయాయి.  వారికి ఇచ్చేదే అరకొర జీతం.

అది కూడా అందకుండా ఉంటే, కార్మికుల జీవితాలు ఎలా గడుస్తాయి? కార్మికులు వారి కుటుంబాలను ఎలా పోషించుకోగలుగుతారు. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణం  వారి వేతనాలు విడుదల చేయాలి. అలాగే, పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా వేతనాలివ్వాలి.

      నర్సయ్య, సంస్థాన్ నారాయణపురం, యాద్రాద్రి జిల్లా