25-05-2025 02:46:21 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): పాకిస్తాన్ ఉగ్రస్థావరాల(Pakistan Terrorist Camps)పై మన దేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)తో ప్రజల్లో దేశభక్తి పెంపొందుతోంది. ఇప్పటికే కొందరు తమకు ఇటీవల జన్మించిన పిల్లలకు సిందూర్, సిందూర అని నామకరణం చేసి దేశభక్తిని చాటుకుంటుండగా, ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం(వి)లో ఆదివారం కొప్పుల వరుణ్ రెడ్డి, ఆశ్రిత దంపతుల కుమారుడు రామ్ నిర్వాన్ రెడ్డి ఎనిమిదవ నెల జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చిన్నారి బాలుడికి సైనిక వేషధారణతో పాటు త్రివర్ణ పతాకం, యుద్ధానికి తాను కూడా సిద్ధం అనే రీతిలో తీర్చిదిద్ది దేశభక్తిని చాటారు. ఈ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు సైనిక వేషధారణలో ఉన్న చిన్నారి రామ్ నిర్వాన్ రెడ్డికి పెద్దయిన తర్వాత దేశ రక్షణ రంగంలో విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేశారు.