మాచినేని కృష్ణయ్య ని పరామర్శించిన మంత్రి తుమ్మల
08-08-2026 02:01 PM
పెనుబల్లి. ఆగస్టు 8(విజయ క్రాంతి): లంకపల్లి మాజీ సర్పంచ్ మాచినేని కృష్ణయ్య.ఒక ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావు అత్యంత ఆప్తుడు మాచినేని కృష్ణయ్య ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం పరామర్శించారు పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన మాచినేని కృష్ణయ్య గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈరోజు ఉదయం హాస్పటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అక్కడ ఉన్న డాక్టర్స్ తో మంత్రి తుమ్మల మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల.తో పాటు సత్తుపల్లి నియోజకవర్గ తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.






