8 August, 2026 | 4:46 PM

హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర

08-08-2026 03:57 PM

గన్నేరువరం,(విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ గన్నేరువరం  మండల అధ్యక్షులు తిప్పర్తి నిఖేష్ అధ్యక్షతన శనివారం హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మండల కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సంగ నరేష్ హాజరై ఆగస్టు 10 నుండి 15 వరకు నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఇంటిపై జాతీయ మువ్వన్నెల జెండా  ఎగురవేసేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, తిరంగా యాత్రలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని అన్ని వర్గాల ప్రజలను 

ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని దేశభక్తిని చాటి తిరంగా జెండా  ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు. గన్నేరువరం బీజేపీ మండల అధ్యక్షులు తిప్పర్తి నిఖేష్  మాట్లాడుతూ, ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఎలేటి చంద్రారెడ్డి అనిల్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.