10న ఆర్టీసీ టీఎంయు జిల్లా స్థాయి సమావేశం
08-08-2026 03:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 10 న సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆదిలాబాద్ రీజినల్ కార్యదర్శి ఆర్.గంగాధర్ తెలిపారు. ఎంయుయూనియన్ కార్యాలయము ప్రారంభిస్తున్నట్లు, జెండా ఆవిష్కరణ ఉంటుందని అనంతరం యూనియన్ ఎన్నికల సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని 6 డిపోలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఉట్నూర్, మంచిర్యాల,నిర్మల్ భైంసా టిఎంయు కార్యకర్తలు, యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు అవ్వాలని ఆయన పిలుపు నిచ్చారు.






