వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల సమీక్ష
20-06-2024 04:32 PM
హైదరాబాద్: వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. పంటల సాగు, ఎరువుల నిల్వలు, సరఫరాపై అధికారులతో తుమ్మల చర్చించారు. జూన్ 19 వరకు 17.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని మంత్రి పేర్కొన్నారు. అత్యధికంగా 15.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని వెల్లడించారు. కందిపంట 76000 ఎకరాల్లో సాగు చేస్తున్నారని చెప్పారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువులు పంపాలని కేంద్రానికి లేఖ రాశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాలం ముందుగా ఆరంభమవుతోందని తమ్మల తెలిపారు.






