7 August, 2026 | 11:11 PM

నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి: రాహుల్ గాంధీ

20-06-2024 04:22 PM

ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరూ బాధ్యత వహిస్తారు

వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యలే

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీకి ఎవరూ బాధ్యత వహిస్తారు? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. లీకేజీపై విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ గురించి కేంద్రం ఆలోచించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందన్నారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపపరమైన లోపాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షంచినట్లుగా పరిస్థితి ఉందన్నారు. వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యలే అన్నారు.

విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దేశంలో స్వతంత్ర విద్య వ్యవస్థ అనేది లేకుండా పోయిందన్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదు అని పేర్కొన్నారు. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ యుద్ధాన్ని ఆపారని చెప్తున్నారు.. పరీక్ష లీకేజీలను మాత్రం ఆపలేదు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ సంస్థల మూసివేతతో ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని రాహుల్ పేర్కొన్నారు.