25 April, 2026 | 1:40 AM

రామచంద్రయ్యకు మంత్రి తుమ్మల నివాళి

27-06-2024 12:05 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు బుధవారం పర్యటించారు. మణుగూరు మండలం సమితిసింగారం గ్రామంలో ఇటీవల మరణించిన  ప్రముఖ డోలు వాద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్య ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి మనో ధైర్యం కల్పించారు. అక్కడి నుంచి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి ఆయన తల్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సాదువు రమేష్‌రెడ్డి, తుపాకుల ఎల్లగండస్వామి, ఎండి రసూల్, తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు. 

మంత్రిని కలిసిన కలెక్టర్, ఎస్పీ 

మణుగూరు పర్యటన నిమిత్తం కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్‌హౌజ్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి మొక్కను అందజేశారు.