15 April, 2026 | 7:13 AM

ఆ ఘనత కేసీఆర్‌దే

22-12-2025 04:32 PM

హైదరాబాద్: కేసీఆర్ డిజైన్ చేసి, నిర్మించిన కాళేశ్వరం(Kaleshwaram) వారి హయాంలోనే కూలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆరోపించారు. మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి.. సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే రాష్ట్రంలో సాగునీరు అందుతోందని ఉత్తమ్ వివరించారు. బీఆర్ఎస్ హయాంలో ఐదేళ్లలో వాడుకున్న నీరుర 70,80 టీఎంసీలే అన్నారు. రూ. 1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం కేసీఆర్, బీఆర్ఎస్ ఘనతే అన్నారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది పదేళ్లకు అంగీకరించారని తెలిపారు.

పాలమూరు, ఎస్ఎల్ బీసీని బీఆర్ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీల కింద ఏటా రూ. 16 వేల కోట్లు చెల్లిస్తున్నామని ఉత్తమ్ లెక్క చెప్పారు. తాను రాసిన లేఖలో 90 టీఎంసీలు అని స్పష్టంగా ఉందని మంత్రి ఉత్తమ్ వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులు పూర్తిగా రాలేదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయకుండా పాలమూరు ప్రజలను అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 5 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టారని ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు.