calender_icon.png 22 December, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

22-12-2025 03:57:04 PM

కూచాడి శ్రీహరి రావు

నిర్మల్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్, నర్సాపూర్ (జి), దిలవార్ పూర్, దిమ్మదుర్తి, స్వర్ణ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిమ్మదుర్తి సర్పంచ్ అల్లెపు లక్ష్మణ్, నర్సాపూర్ సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, దిలావర్పూర్ సర్పంచ్ పాల్దె అక్షర అనిల్, లింగాపూర్ సర్పంచ్ రాధా రమణ, స్వర్ణ సర్పంచ్ కె మల్లేష్, సారంగాపూర్ సర్పంచ్ భూమన్న ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నూతన సర్పంచులు గ్రామాలను మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలని అన్నారు. దిమ్మదుర్తి గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించడం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో, నిర్మల్ సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సోమ భీమ్ రెడ్డి అబ్దుల్ హాది, నాయకులు ఉమామహేశ్వర్, అజీమ్,కోడె రాజేశ్వర్, సప్పల రవి, బుల్లోజి నరసయ్య, రవీందర్ రెడ్డి, వంజర్ శ్రీనివాస్ రెడ్డి, కొట్టే శేఖర్, గాజుల రవికుమార్, తదితరులు ఉన్నారు.