29 August, 2026 | 2:05 PM

చిన్న, చిన్న లిప్టులు ఏర్పాటు చేస్తే రైతులకు లాభం: మంత్రి ఉత్తమ్

10-06-2024 04:52 PM

 కోదాడ: చిన్న, చిన్న లిప్టులు ఏర్పాటు చేస్తే రైతులకు లాభం కలుగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాట పట్టణంలో మంత్రి ఉత్తమ్ సోమవారం పర్యటించారు. ఎత్తిపోతల పథకాలపై సాగునీటి అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో చిన్న ఎత్తిపోతల పథకాల కింద 6 లక్షల ఎకరాల సాగు జరుగుతోందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తిపోతల పథకాలకు లక్షల కోట్ల వ్యయం అవుతూందని తెలిపారు. కృష్ణ,గోదావరి, మూసీ నదులు, కాలువలపై లిఫ్టులు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే లిఫ్ట్ కాలువలపై పొరుగు సేవల పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని సూచించారు. పాక్షికంగా ఉన్న లిఫ్టులను 100 శాతం అందుబాటులోకి తెస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.