వాహనదారులకు ఇబ్బంది కలిగించవద్దు
కొత్తూరు అండర్ పాస్ ను పరిశీలించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
షాద్ నగర్ జూన్ 23 (విజయక్రాంతి): వర్షాకాలంలో అండర్ పాస్ లో నీరు నిల్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి(Future City Police Commissioner Tarun Joshi) అన్నారు. సోమవారం కొత్తూరు మున్సిపాలిటీలో అండర్ పాస్ ను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి,డిసిపి శిరీష రాఘవేందర్,ఏసీపీ లక్ష్మీనారాయణ,సిఐలు నరసయ్య,శంకరయ్య తో కలిసి పరిశీలించి నేషనల్ హైవే అడ్వైజర్ భాను ప్రకాష్ కు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. వర్షాకాల దృష్ట్యా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్పాస్ లో నీరు నిలవకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని కమిషనర్ తరుణ్ జోషి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సత్యశిలారెడ్డి,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






