8 June, 2026 | 4:28 PM

Breaking News

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి   •   ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ   •   శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు   •   సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ   •   గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్   •   పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి   •   మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ   •   అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం   •  

అంతారం పాండురంగ విట్టలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి

15-11-2025 10:43 PM

మునిపల్లి: మండలంలోని అంతారం గ్రామంలో గల శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయాన్ని శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దామోదరను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, మాజీ ఎంపీటీసీ పాండు, మాజీ కోఆప్షన్ నెంబర్ రహీం తదితరులు ఉన్నారు.