calender_icon.png 16 November, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అంధకారంలో వరి కొనుగోలు కేంద్రాలు

15-11-2025 10:41:12 PM

విద్యుత్ సౌకర్యంతో పాటు త్రాగునీరూ సైతం కరువు..

కొల్చారం (విజయక్రాంతి): కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సరైన వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగడానికి నీరు లేదు, రాత్రి వేళలో లైట్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క జిల్లా కలెక్టర్ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని రైతులు తెలిపారు. ధాన్యం తూకం వేసే సమయంలో లైట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని వెంటనే అధికారులు స్పందించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.