calender_icon.png 16 November, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో ప్రచార జాత

16-11-2025 12:00:00 AM

- భద్రాచలం వరకు కార్యక్రమ నిర్వహణ

- డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ 

- కమ్యూనిస్టులు మరింత బలపడాలి

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్,నవంబర్15(విజయక్రాంతి): కుమ్రం భీం జిల్లా కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామంలో జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు చేపట్టే ప్ర చార జాతను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు.

ముందుగా కుమ్రం భీం విగ్రహానికి కూనంనేని పూలమాలలు వేసి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మ్యూజియంలోని భీం అనుచరుల ప్రతిమలు, ఆదివాసి గిరిజనులు ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు, అభరణా లు, వ్యవసాయ పరికరాలను తిలకించారు. అనంతరం కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26 ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకుంటున్నదని తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం కావా లని తొ లుత గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని కొనియాడారు. ప్రజా సంఘాలను నిర్మించి వెట్టి చాకిరి విముక్తి కోసం కార్మికుల, కర్షకులను దోపిడినుంచి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు కొనసాగించిందన్నారు. ఈ శతా బ్ద కాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు ఎంతో మంది అమరవీరుల రక్తతర్పణలతో ఎన్నెన్నో విజయాలు సాధించి భారత రాజకీయ చరిత్రలో సీపీఐ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుందని కూనంనేని తెలిపారు. దేశంలో నేడు నెలకొన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు.

వామపక్ష ప్రజాతంత్ర పురగామి శక్తులు కమ్యూని స్టుల ఐక్యతను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా తలపెట్టిన ప్రచార జాత జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 26న ముగిం పు సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బద్రి సాయికుమార్ సీనియర్ నాయకుడు కలవేని శంకర్, సత్యనారాయణ, చిరంజీవి, ఉపేందర్, శంకర్ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.