18-09-2025 01:15:52 AM
నర్సాపూర్ (మెదక్), సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుం టున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సరసమైన ధరలకే లబ్ధిదారులకు ఇసుకను అందించ డం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి అన్నారు.బుధవారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యా ర్డులో శాండ్ బజార్, వైకుంఠధామాన్ని మం త్రి ప్రారంభించారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి ధ్యేయమని ఆయన తెలిపారు.
మెదక్ జిల్లాకు పదివేల ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు అయ్యాయని ప్రస్తుతం 32, 40 శాతం ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇసుక నల్గొండ నుంచి రావడం జరుగుతుందని, ప్రస్తుతం నర్సాపూర్ శాండ్ బజార్లో 1100 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని తెలిపారు.
అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమీ పంలో ప్రభుత్వం తరఫున నిర్మించిన మాడ ల్ ఇందిరమ్మ ఇల్లును మంత్రి చేతుల మీదు గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి ల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నాగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సు హాసినీరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరె డ్డి, ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, టిఎస్‌ఎండిసి ప్రాజెక్ట్ డైరెక్టర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.