18-09-2025 01:15:45 AM
టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బిచ్కుంద సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్ కు పార్టీలో ఎలాంటి పదవి లేదని, ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందని టీపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం సొంత సోదరుడి కుమారుడు సౌదాగర్ అరవింద్.
2023 నవంబర్‌లోనే అరవింద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి సస్పెండ్ చేసినప్పటికీ.. తాను పార్టీలోనే ఉన్నట్లు చెప్పుకుంటూ చెలామణి అవుతున్నట్లు తమవద్ద సమాచారం ఉన్నట్లు పార్టీ తెలిపింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతు తెలుపుతూ ప్రచారం చేశాడని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అరవింద్ కాంగ్రెస్ పార్టీ పేరుతో తప్పుడు పైరవీలు చేసుకునే అవకాశముందనే ఉద్దేశంతో ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సౌదాగర్ అరవింద్ జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా చెలామణి అవున్నట్లు తమవద్ద సమాచారం ఉందని.. కానీ ఆయనకు కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులు లేవన్నారు.