9 March, 2026 | 8:20 AM

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు

08-03-2026 03:36 PM

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ రెండు నూతన కార్యక్రమాలను ఆదివారం ప్రారంభిస్తోంది. ఉదయం 11.30 గంటలకు బంజారా హిల్స్ లోని కుమ్రం భీం ఆదివాసి భవన్లో వర్కింగ్ వుమెన్ హస్టల్స్ ఆన్ లైన్ పోర్టల్, బస్ స్టేషన్, రద్దీ ప్రాంతాల్లో చంటి పిల్లల తల్లుల సౌకర్యార్దం పాలిచ్చే గదులను ఏర్పాటు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ప్రాంతాల్లో Feeding kioskలను ప్రారంభించనున్నారు.

Feeding kiosk నమూనాను మంత్రులు సీతక్క(Minister Seethakka), దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)లు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్కింగ్ వుమెన్ హస్టల్ కోసం ఆన్ లైన్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పోర్టల్ ద్వారా వర్కింగ్ వుమెన్ హస్టల్ లో అడ్మిషన్లు, నిర్వహణ, ఫిర్యాదులు సులభతరం అవుతాయి. 

దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, సెర్ప్ సంయుక్తంగా ఎస్ హెచ్ జీ మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రోఫైల్స్ సిద్దం చేసే ప్రాజెక్టును లాంచంనంగా ప్రారంభిస్తారు. సాయంత్రం శిల్పారామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడకలు మహిళా సంఘాల సభ్యుల నడుమ ఘనంగా జరగనున్నాయి. ఇందిరా మహిళా శక్తి అచీవ్ మెంట్స్ బుక్ ను మంత్రి సీతక్క ఆవిష్కరిస్తారు. ఇది రాష్ట్రంలో మహిళల విజయాలను ప్రతిబింబించనుంది.