17 June, 2026 | 3:35 AM

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటులో మరో ముందడుగు

17-06-2026 02:34 AM
  1. జిల్లాలో పర్యటించిన బెంగుళూరు ఎయిర్ ఫోర్స్ అధికారుల బృందం...
  2. భూ సేకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా సమీక్ష...

ఆదిలాబాద్, జూన్ 16 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్న ఎయి ర్ పోర్టు ఏర్పాటుకు సర్వేలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్ ఫోర్స్ బృంధం విమనాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే. తాజాగా బెంగుళూరుకు చెందిన ఎయిర్ పోర్స్ ఉన్నతాధికారులు జె.పి సబర్వాల్, ఎస్.జి హెగ్దే, ఎస్.కె రెడ్డి, రాష్ట్ర సివిల్ ఏవియేషన్ డైరక్టర్ భరత్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించారు.

ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా లతో కలిసి విమానాశ్రయ మైదానంతో పాటు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మైక్రో లెవల్ సర్వే నిర్వహించారు. రన్ వే విస్తరణతో పాటు సాంకేతిక అంశాలపై సమాలోచనలు చేశా రు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో బృందం సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా భూసేకరణ, ఇతర అంశాలపై సుదీ ర్ఘంగా చర్చించారు.

రక్షణ శాఖకు 1500 ఎకరాలు, రన్ వే విస్తరణకు మరో 80 ఎకరాలు అవసరం ఉంటుందని అధికారులు తేల్చా రు. విమనాశ్రయం, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు కు మొత్తం 1840 ఎకరాల భూమి అవసరమని.. ఇందులో 1700 ఎకరాలు రక్షణ శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సుముఖత వ్యక్తం చేస్తూ ఇటీవలే కేంద్రంతో పాటు రక్షణ శాఖకు లేఖ రాసిం ది.గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాల అనుమతుల ప్రక్రి య వేగవంతం చేసేందుకు జిల్లాలో బృందం పర్యటించింది.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన పూర్తయ్యిందని.. గత మార్చిలోనే కేం ద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రాంమోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలతో ఈ విషయమై డిల్లీలో చర్చించామని తెలిపారు. రక్షణ శాఖ కోరిన విధంగా 1500 ఎకరాల భూసేకరణకు కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు సమన్వ యంతో పని చేస్తున్నాయన్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు బృంధం సభ్యులు, జిల్లా అధికారులతో పలు అంశాలను చర్చిం చి నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ... ఆదిలాబాద్ లో జా యింట్ యూజర్ (డిఫెన్స్-సివిల్) ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చర్యలను వేగవంతం చేశామన్నారు.

ఇప్పటికే 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అదనంగా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎయిర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) కోసం 1,500 ఎకరాలు, సివిల్ ఏవియేషన్ రన్ వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలను కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందని వివరించారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

సీఎంఓ కార్యాల యం, ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీకి భూములను అప్పగిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు సివిల్ ఏవియేషన్తో పాటు డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం ప్రజలకు ఒక చారిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్, ఆర్డీఓ జగదీశ్వర్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఎడి ప్రభాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, గో వింద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.