9 March, 2026 | 10:53 PM

ఎక్సైజ్‌శాఖ కళ్లు తెరవాలి ప్రబో?

09-03-2026 12:27 AM

బెల్ట్ షాపుల జోరు యువత బేజారు 

తాగిన మైకంలో కన్న వాళ్ళని కడతేర్చుతున్నారు 

కామారెడ్డి, మార్చి 8 (విజయక్రాంతి): ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నారా...? కామారెడ్డి జిల్లాలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో బెల్ట్ షాపులు జోరు గా వెలియడంతో యువత మద్యం మత్తులో జోగు తున్నారు. దీంతో కన్నవారిని సైతం కడ తేర్చుతున్న ఘటనలు రోజురోజుకు జిల్లాలో పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ బి నగర్ కాలనీలో ముగ్గురు పిల్లలను పెద్ద చెరువులో వేసి హతమార్చిన చిన్నారుల తండ్రి ఇస్మాయిల్ మద్యం మత్తు లో నే చేసిన ఘటనేనని తెలుస్తోంది.

ఇటీవల జిల్లాలో బాన్స్ వాడ నియోజక వర్గంలో కన్నతండ్రిని కడ తేర్చిన కొడుకు ఘటనతో పాటు కన్నతల్లిని మద్యం తాగేందుకు డబ్బుల కోసం కన్నతల్లిని హతమార్చిన కసాయి కొడుకు ఉదంతాలు చూస్తుంటే బెల్టు షాపుల మద్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెల్ట్ షాపులు గల్లీ గల్లీకి వాడవాడలో మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో యువకులు మద్యం కు బానిసలై మత్తులో తూలుతున్నారు. మద్యానికి బానిసలై డబ్బులు లేనప్పుడు రక్తసంబంధికులని కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్న జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. వర్ని మండల కేంద్రంలో ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇలాంటి వి పట్టణాల్లో సైతం కాలనీలో కిరాణా షాపులలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

వైన్స్ ల నుంచి మద్యాన్ని తెచ్చి అధిక రేటులో గ్రామాల్లో పట్టణాల్లోని కాలనీలో మద్యాన్ని బెల్టు షాపుల ద్వారా  విక్రహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు నెలసరి మామూలు తో పాటు ఉన్నతాధికారుల టార్గెట్ కోసం మద్యం షాపుల యజమానులపై ఒత్తిడి తేవడంతో బెల్ట్ షాపు లు  బార్ల లాగా మారాయి. పుట్టగొడుగుల లాగా వెలసిన బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎక్సైజ్ అధికారులు నిర్రక్ష ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు తెరవాలని ప్రజలు కోరుతున్నారు.

బెల్ట్ షాపులతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో చిచ్చు రేపుతున్నాయి. తల్లి,దండ్రులు, యువకులకు, భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతో పాటు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. జిల్లాలోని ప్రతి గ్రామాలలో బెల్టు షాపులు బార్లను తలపిస్తున్నాయి. ఒక్కొక్క గ్రామంలో బెల్ట్ షాపూల నిర్వాహకులు వేలం వేసి మరి దక్కించు కోవడం చూస్తుంటే ఏవి ఏ స్థాయిలో మద్యం విక్రయాలు సాగుతున్నాయో అనడానికి నిదర్శనం.

బెల్ట్ షాపుల విక్రయాలను  అడ్డుకుంటాం 

కామారెడ్డి జిల్లాలో పట్టణాల్లో, గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయని వాటి నీ అరికట్టడానికి ఎందుకు కృషి చేయడం లేదని జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ హనుమంతరావును విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా బెల్టు షాపు లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బెల్ట్ షాపుల అమ్మకాల వై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

--- హనుమంతరావు, ఎక్సైజ్ సూపర్డెంట్, కామారెడ్డి