జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన మైనార్టీ స్కూల్ విద్యార్థులు
కారేపల్లి, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైరా నియోజకవర్గస్థాయి తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో తమ ప్రతిభను కనపరిచారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కే.సుజాత,ఎం. అక్షిత,బీ.కరుణలు ఈనెల 22 23వ తేదీలలో తమిళనాడులోని చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీయస్థాయిలో నిర్వహించిన అశ్విత కేలో ఇండియా రబ్బి లీగ్ పోటీలలో కాంస్య పతకాన్ని సాధించారు. అదేవిధంగా వీరు ప్రాతినిధ్య వహించిన జట్టుకు రూ.48 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.
జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి గురువారం కారేపల్లికి చేరుకున్న వారి ముగ్గురికి స్థానిక బస్టాండ్ సెంటర్లో మండల విద్యాశాఖ అధికారి జయరాజు,పాఠశాల ప్రిన్సిపల్ దారా సావిత్రి లతోపాటు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆ విద్యార్థులతో పాటు పీడీ జారే అనుష, పిఈటి నాగేంద్రమ్మలను సన్మానం చేసి పాఠశాల సాంప్రదాయ పద్ధతితో కూడిన ర్యాలీగా పాఠశాల వరకు తీసుకువెళ్లారు.




