నడి రోడ్డులో గుంత నిద్రావస్థలో ఆర్‌అండ్‌బి అధికారులు
అశ్వారావుపేట, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) : అది దమ్మపేట - పాల్వంచ ప్రధాన రహదారి. ఆ రహదారి లో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ రహదారి లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తిరుగుతూ వుంటారు. కానీ ఎవ్వరికి రహదారి మధ్యలో ఉన్న గుంత గాని, గుంత మధ్యలో ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక డ్రమ్ కనపడటం లేదు.ప్రజలు, వాహనదారులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు డ్రమ్ పక్క నుండి సాగిపోతున్నారు గాని ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదు. స్థానికులు ప్రమాదాలు జరగకుండా డ్రమ్ పై స్టాప్ అని రోడ్డు మధ్యలో పెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అశ్వారావుపేట నియోజక వర్గ పరిధి లోని ములకల పల్లి మండలం పాత గంగారం ఊరు మధ్యలో ఉంది. సుమారు అడుగున్నర లోతు , మూడు అడుగుల పొడవు న గుంత ఏర్పడింది. ఈ గుంత లో అనేక కార్లు, ద్వి చక్ర వాహనాలు పడి ప్రమాదాలకు గురయ్యాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల సమయం లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్ పి కూడా ఈ మార్గం లోనే పర్యటించారు.
వారి దృష్టి లో కూడా ప్రమాదకర గుంత కనిపించినట్టు లేదు. కనిపించిన పట్టించుకోలేదో వారికే తెలి యాలి. ఎన్నికల తరవాత అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా ప్రయాణిం చారు, ములకలపల్లి మండలం లో పర్యటించారు.
కానీ ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా రోడ్లు భావనల శాఖ అధికారులు నిత్యం అశ్వారావుపేట, కొత్తగూడెం తిరుగుతూనే వుంటారు. వారు కూడా ఇది మాకు సంబంధం లేనట్టు గానే వ్యవహరిస్తున్నారు.ఎపుడు ఏ ప్రమాదం జరిగిద్దో అనే ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైన ఆర్ అండ్ బి అధికారులు స్పందించి గుంత ను పూడ్చి, ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.




