17 April, 2026 | 11:27 AM

తప్పిపోయిన బాలిక క్షేమం

28-05-2025 12:14 AM

సంరక్షించిన మియాపూర్ పోలీసులు

శేరిలింగంపల్లి, మే 27: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం గోపాల్ రావు నగర్ కాలనీలో 8 ఏళ్ల బాలిక తప్పి పోయింది. అయితే బాలి కను గుర్తించిన పోలీసులు ఆమెను తమ సంరక్షణలో ఉంచారు. తన పేరు జ్యోతిక, తల్లిదండ్రుల పేర్లు అఖిల నవీన్ అని చెబుతుందని ఎస్‌ఐ శ్రీకాం త్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఈ పాపను గుర్తిస్తే తన ఫోన్ నెంబర్ 87125 68116లో సంప్రదించాలని యస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి కోరారు.