calender_icon.png 29 May, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య

28-05-2025 12:16:01 AM

  1. యువకుడి ప్రేమను నిరాకరించిన యువతి 

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

శేరిలింగంపల్లి,మే 27: ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని మనస్తాపంతో 17 ఏళ్ల యువడాన్స్ మాస్టర్ తాను పనిచేస్తున్న స్టూడియోలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన సాగర్ మియాపూర్లోని డెలాయిట్ డ్యాన్స్ స్టూడియో లో పనిచేస్తున్నాడు. రాత్రిపూట స్టూడియోలోని ఒక గదిలో ఉండేవాడు.

సాగర్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఇటీవల తన ప్రేమ వైఫల్యం గురించి డ్యాన్స్ స్టూడియో యజమాని పరమేష్తో పంచుకున్నాడని తెలుస్తోంది. గత వారం రోజులుగా సాగర్ తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం అర్ధరాత్రి డ్యాన్స్ స్టూడియో లోని తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించాడు. డ్యాన్స్ స్టూడి యో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.