28-05-2025 12:14:30 AM
-ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు
- సింగరేణిలో జాగృతి ఆవిర్భావం
- 11 మంది కోఆర్డినేటర్ల నియామకం
- ఎమ్మెల్సీ కవిత రాజకీయ ప్రస్థానంపై రాజకీయవర్గాల్లో చర్చ
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి) : గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ కవిత లేఖాస్త్రం ప్రకంపనలకు ఎండ్ కార్డు పడలేదు. ఈ అంశం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. పార్టీ ఎంపీ దామోదర్ రావు, సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావులు కవితతో సోమవారం ఆమె నివాసంలో భేటీ అయి అనేక అంశాలపై చర్చించినా ఫలితం కనిపించలేదు.
అయితే కేటీఆర్‌కు కారు రేస్ కేసులో ఏసీబీ నోటీసులు రావడం, కేటీఆర్‌కు మద్దతుగా ఎక్స్‌లో కవిత పోస్టు చేయడంతో కవిత మెత్తబడిందని అంతా భావించారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తే కవిత తన సొంత ఎజెండాతో జాగృతిని తెలంగాణలో మరింత విస్తృతపరిచే పనిలో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. తన జాగృతితో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నారని కారు పార్టీ నేతలు అంటున్నారు.
సింగరేణి జాగృతి ఏర్పాటు..
మంగళవారం కవిత సింగరేణి నేతలతో తన నివాసంలో భేటీ అయ్యారు. సింగరేణి 11 ఏరియాలకు సంబంధించిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం లో సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. సింగరేణి 11 ఏరి యాలకు జాగృతి కోఆర్డినేటర్లను నియమించారు.
ఆ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళా విభాగం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. టీబీజీకేఎస్‌ను సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుందన్నారు.
రాజకీయ పార్టీలకు సింగరేణి అంటే తమ ప్ర యోజనాలు మాత్రమేనని, కార్మికులకు ఆ సంస్థే జీవితమని కవిత అన్నారు. సింగరేణి కార్మికులు విద్య, వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారా నికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేయాలని కుట్రలు పన్నుతోందని వాటిని అడ్డు కుంటామన్నారు.
సింగరేణి స్కూళ్లను పునరుద్ధ్దరించి సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబో ధన చేయాలని, కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందజేయాలన్నారు. కార్మిక కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించాలని, తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
1970లో నిర్మించిన క్వార్టర్స్ కూలిపోయే దశలో ఉన్నాయని, అన్ని రీజియన్లలో కార్మికుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్టుల్లో ఎస్‌డీఎల్ వెహికిల్స్‌ను సింగరేణి కార్మికులతోనే నడిపించాల్సి ఉండగా ఆ మిషన్లను ప్రైవేటు వాళ్ల తో నడిపిస్తున్నారని, ఇది ఓపెన్ కాస్టుల నుంచి కార్మికులను తొలగించే కుట్ర అన్నారు.
సింగరేణి సంస్థ ద్వారా సమకూరుతున్న డీఎంఎ ఫ్ టీ నిధులను కార్మికులకు మెరుగైన వసతులు కల్పించడానికి వినియోగించుకుండా సీఎం, డిప్యూటీ సీఎంల నియోజకవర్గాలు కొడంగల్, మధిరకు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రధా ని నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నారని, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్‌పై మాట్లాడటం లేదని విమర్శించారు. బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, రామగుండం రామగుండం రామగుం డం భూపాలపల్లి, మణుగూరు, కొత్తగూడెం, కార్పోరేట్, ఎస్టీపీపీ పవర్ ప్లాంట్‌ల కోఆర్డినేటర్లను కవిత నిమయమించారు.