ప్రభుత్వ పాఠశాలకు మిట్టపల్లి సర్పంచ్ కుర్చీలు అందజేత
25-02-2026 12:41 AM
ఇల్లందు టౌన్, ఫిబ్రవరి24,(విజయక్రాంతి): ఇల్లందు మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పలు పాఠశాలలకు 20 కుర్చీలను మిట్టపల్లి సర్పంచ్ నాగార్జున అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటానని తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు.




