15 June, 2026 | 1:09 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •   యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన   •   మైనర్ల రక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకం   •  

వాట్సాప్‌లో టెన్త్ హాల్ టికెట్లు

25-02-2026 12:39 AM

రెండుమూడు రోజుల్లో విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): టెన్త్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వా రా పంపించనున్నారు. విద్యార్థుల రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు వాట్పాప్ లింకులను పం పించనున్నారు. ఈ లింకును క్లిక్ చేసి విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. అలాగే ఈసారి నుంచి హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నామని, దీని సహాయంతో విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులువుగా చేరుకోవచ్చని తెలిపారు. రెండుమూడు రోజుల్లో టెన్త్ హాల్‌టికెట్లను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,17,577 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో తెలుగు మీడియం వారు 50 వేల పోపే ఉన్నా రు. పరీక్షల నిర్వహణ కోసం 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

ఆల్ ది బెస్ట్! నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

1,495 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు

లాంగ్వేజ్ పరీక్ష రాయనున్న విద్యార్థులు

హాజరు కానున్న 4,89,126 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు

ఏర్పాట్లు పూర్తి చేసిన సంబంధిత అధికారులు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారం భంకానున్నాయి. నేడు ఫస్టియర్ విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను రాయనున్నారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,89,126 మంది, సెకం డ్ ఇయర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పిరియడ్ (ఆలస్యంగా వచ్చినా) కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 1495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 28,500 మంది ఇన్విజలేటర్లు, 75 మంది ఫ్లయింగ్‌స్క్వాడ్స్, 200 మంది సిట్టిం గ్ స్కా డ్‌ను అధికారులు నియమించారు. పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధి కారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక గురువారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను నిర్వహిస్తారు.