బుగ్గరాజేశ్వర దేవాలయంలో బియ్యం వేలం
02-09-2025 07:34 PM
సిద్ధిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట గ్రామంలో గల శ్రీ స్వయంభు బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో దాతలు సమర్పించిన బియ్యం బహిరంగ వేలం రేపు 03-09-2025 (బుధవారం) ఉదయం 11:00 గంటలకు నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బాగన్న గారి కరుణాకర్ ముదిరాజ్, కార్యనిర్వాహణ అధికారి కొమ్మేర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – దాతలు సమర్పించిన ధాన్యాన్ని పారదర్శకంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించి, వచ్చిన ఆదాయం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించబడుతుందని తెలిపారు. అలాగే ఆసక్తి గల దాతలు, భక్తులు, గ్రామ ప్రజలు తప్పక ఈ వేలంలో పాల్గొని లబ్ధి పొందాలని విజ్ఞప్తి చేశారు.






