30 June, 2026 | 8:40 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

ఏటీసీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

05-10-2024 05:14 PM

మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో రూ.4కోట్ల 60 లక్షలతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటిసి) భవనానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు అనేకమైన వసతులు కల్పిస్తుందని వాటిని ప్రతి ఒక్క విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు.ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి ప్రభాకర్ , సూపరింటెండెంట్ జ్యోతి,రాణి , ట్రైనింగ్ ఆఫీసర్ జి రవి,ఎస్డి ఇఫ్తాకర్ సీనియర్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్ జీవీ కృష్ణారావు, ఎం శ్రీనివాస్, ఏ నర్సయ్య, వేణుగోపాల్,  మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.