30 June, 2026 | 9:45 PM

Breaking News

రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •  

పుల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఘనంగా స్వాతి నక్షత్ర ఉత్సవం

05-10-2024 05:08 PM

నవ కళశ అభిషేకం.. సుదర్శన నరసింహ హోమంలో పాల్గొన్న భక్తులు

సిద్దిపేట (విజయక్రాంతి):  సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండపై గల స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో శనివారం స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు. నరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ప్రతినెలా పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్ర ఉత్సవం ఘనంగా జరుగుతుందని అందులో భాగంగా పుల్లూరు బండపై ముందుగా స్వయంభూ నరసింహ స్వామి మూర్తికి దేవాలయ వంశ పారంపర్య అర్చకులు కలకుంట్ల రంగా చార్య, పొడిచేటి రామకృష్ణమా చార్య, విజయ్, జయంత్ సాయి, కలకుంట్ల నచికేతల ఆధ్వర్యంలో పంచామృతాలతో నవకళష అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దేవాలయ ఆవరణలో సుదర్శన నరసింహ హోమం వైభవంగా వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుల్లూరు గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం తిరుపతిరెడ్డి, ఒగ్గు మురళి, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.