మట్టి వినాయకుడే ముద్దు... ఎమ్మెల్యే పిలుపు

12-09-2026 | 01:11pm

ఉప్పల్ సెప్టెంబర్ 12 విజయక్రాంతి : పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్(Uppal Press Club) ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా ప్రకృతిని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు, నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. సంప్రదాయాలను కొనసాగిస్తూనే ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకటరామిరెడ్డి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వి. తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి. శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. సాగర్, ఉపాధ్యక్షులు ఏవీ. శ్రీధర్‌రావు, కే. నరోత్తమరెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ డి. రాజు, సీనియర్ జర్నలిస్టులు కొలనుపాక చంద్రమౌళి, పి. మహేందర్‌రెడ్డి, మండల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు