కందుకూరు సబ్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే సండ్ర నిరసన
12-09-2026 | 02:10pm
వేంసూర్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): విద్యుత్ కోతలతో వరి పంటలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Former MLA Sandra Venkata Veeraiah) ఆరోపించారు. రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కందుకూరు సబ్‌స్టేషన్ వద్ద భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఐదు గ్రామాలకు వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన త్రీఫేస్ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.