నీటి సమస్య పరిష్కరించాల్సిందే
కొత్తపేట డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నాగోల్, మే 26 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని శివశంకర్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, శివగంగ కాలనీ, శ్రీనివాస కాలనీలలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. కాలనీల్లో నెలకొన్న మంచినీటి సమస్యలపై ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నీటి సరఫరాలో తక్కువ ఒత్తిడి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోయారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపడా నీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.






