అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు మండలం బాలాజీ నగర్ గ్రామపంచాయతీ ఐసిడిఎస్ భవన్ లో బుధవారం అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు పోషక ఆహారం అందించడంలో మంచి గుణాలు అలవర్చడంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమైనదన్నారు. పిల్లలకు గర్భిణీలకు పోషకాహారం అందించడం ప్రతి పని పారదర్శకంగా నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందించడం శుభ పరిణామన్నారు.
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలని బలోపేతం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు బడిబాట పట్టాలన్న దానికి మూల కారణం అంగన్వాడీ టీచర్లు అని కొనియాడారు. అంగన్వాడి టీచర్ల సమస్యలు అన్ని కుడా ప్రజా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయని త్వరితగతిన వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనీ తెలిపారు. గర్భిణీలకు పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందించి పారదర్శకత పాటించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
పంపిణీ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ అరుణ కుమారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఇల్లందు మున్సిపాలిటి చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండెల రాజు, ఇల్లందు మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు పాయం స్వాతి, ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి సైదులు, ఇల్లందు మున్సిపాలిటి కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, మిట్టపల్లి సర్పంచ్ గుగులోతు నాగార్జున్, నాయకులు బోళ్ళ సూర్యం, తాటి భిక్షం, స్ధానిక ఉప సర్పంచ్ ఈశ్వరమ్మ, వార్డు మెంబర్లు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.






