నేటి మణుగూరు పట్టణ బంద్‌కు సహకరించండి
అఖిలపక్ష పార్టీల పిలుపు
మణుగూరు,(విజయక్రాంతి): ఏరియాలోని ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికి అప్పగించాలని, మణుగూరు ఓసీ విస్తరణకు (ఎక్స్‌టెన్షన్) అవసరమై న అనుమతులు వెంటనే తీసుకురావా లని డిమాండ్ చేస్తూ సేవ్ మణుగూరు పేరుతో మంగళవారం మణుగూరు పట్టణ బంద్ నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. ఈ మేరకు సీపీఐ నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, సీపీఎం నాయకుడు సత్రపల్లి సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు ఆర్. మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు మద్దెల భద్రయ్య సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు.
సోమవారం మణుగూరులో వారు మీడియాతో మాట్లాడుతూ, 1974లో మణుగూరులో ప్రారంభమైన సింగరేణి బొగ్గు గనులు ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. సింగరేణి వల్లే మణుగూరులో వ్యాపార, వాణిజ్య, ఉపాధి అవకాశాలు విస్తరించా యని తెలిపారు. ప్రస్తుతం ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆ బ్లాక్‌ను సింగరేణి సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
అలాగే మణుగూరు ఓసీ విస్తరణకు అవసరమైన అనుమ తులు వెంటనే తీసుకురాకపోతే భవిష్య త్తులో బొగ్గు కొరత ఏర్పడి మణుగూరు ఆర్థిక, పారిశ్రామిక మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహి స్తున్న పట్టణ బంద్‌కు పట్టణ ప్రజలు, చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాలు, పట్టణ ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి సహకారం అందించి విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు.






