పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుల పరామర్శ
15-04-2026 02:11 PM
కరీంనగర్, క్రైమ్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి తల్లి బతుకమ్మ అనారోగ్యంతో ఇటీవల ఖమ్మంలో మృతిచెందగా, వారి కుటుంబాన్ని పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, కార్పొరేటర్ వాసాల రమేష్, రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం, రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ వల్లాల క్రిష్ణహరి తో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు స్వర్గం నర్సయ్య ఖమ్మంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి మృతి పద్మశాలి సమాజానికి తీరనిలోటని వారన్నారు.






