ప్రజా ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యం
చిట్యాల,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల, వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి తరగతి గదులను సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థులు పాఠశాల గ్రౌండ్ లో వర్షపు నీరు నిలుస్తుందని వివిధ సమస్యలు తెలుపగా వెంటనే ఎమ్మెల్యే సంబంధిత శాఖ ఏఈ జీవన్ కుమార్ తో ఫోన్ లో సంభాషించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేసి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు, భోజనాన్ని అందిస్తుందని అలాగే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలను పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.






