కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
02-09-2025 07:22 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొద్దిరోజులుగా బి ఆర్ ఎస్ ఎమ్ఎల్ సి కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ పార్టీ నాయకుల పై అసత్య ఆరోపళ్ళు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు అని కేసీఆర్ గతంలోనే చెప్పారు.
తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని చెప్పారు కన్నకూతురు కంటే కూడా కష్టం లో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని ఎమ్ ఎల్ సి పార్టీ నుండి సస్పెండ్ చేయడం హర్షించదగ్గ విషయం, పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైందని కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ ప్రకటనలో తెలిపారు.






