జిన్నారంలో అభివృద్ధి జోరు

28-09-2026 | 02:09pm

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

జిన్నారం, సెప్టెంబర్ 28: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్(Jinnaram Municipality) కేంద్రంలో ఒక కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 33 దుకాణాల సముదాయాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy). నూతన దుకాణాల ద్వారా మున్సిపాలిటీకి ప్రతి నెల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో ప్రతి వార్డులో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని తెలిపారు. జిన్నారం మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్   నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రాజేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు