11-11-2025 12:39:52 AM
చేవెళ్ల, నవంబర్ 10 (విజయక్రాంతి) చేవెళ్ల సహకార సంఘం కార్యాలయంలో సోమవారం సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డితో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య... మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని, ప్రభుత్వం క్వింటాల్ కు రూ.2400 కనీస మద్దతు ధర కల్పిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబర్, మార్కెట్ కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ ఉప సర్పంచులు, నాయకులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 5 లక్షల చెక్కు అందజేత
చేవెళ్ల, నవంబర్ 10( విజయక్రాంతి) దేశవ్యాప్తంగా అందరిని తీవ్రంగా కలిచి వేసిన చేవెళ్ల మండలం మీర్జగూడ బస్సు- టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహార పంపిణీ కొనసాగుతూనే ఉంది. సోమవారం టిప్పర్ లారీ డ్రైవర్ ఆకాష్ కామ్లె కుటుం బానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రూ. 5 లక్షల పరిహారం చెక్కును చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళలు స్థానిక నాయకు లతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 19 మంది చనిపోవడం అందర్నీ కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రమా దంలో గాయపడిన బాధితుల గుణంగా ప్రభుత్వం త్వరలోనే పరిహారం అందజే స్తుందని ఆయన చెప్పారు.