11-11-2025 12:47:13 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్
ఆదిలాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): ప్రజాకవి అందే శ్రీ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజా ఉద్యమాలకు తీరని నష్టం అని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఆయన మృతికి సంతా పం తెలియజేస్తూ సోమవారం స్థానిక సీపీ ఎం పార్టీ కార్యాలయంలో సంతాప సభ జరిపారు. ఈ సందర్బంగా అందె శ్రీ చిత్రపటా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మల్లేష్ మాట్లాడుతూ... తెలంగాణ అధికారిక గీతాన్ని రాసిన అందే శ్రీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో జీవించి ఉం టారన్నారు.
మాయమై పోతున్నాడమ్మా మనిషన్న వాడు అంటూ మనిషిలో నీ మానవత్వాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారన్నారు. బడికి పోయి అక్షరాలు నేర్వని అయన సమా జం అనే బడిలో అక్షరాలు నేర్చి అక్షరాలను ఆయుధాలుగా మలిచారన్నారు. కాకాతీయ యూనివర్సిటీ నుండీ డాక్టరేట్ పొంది, అనేక అవార్డులు పొందిన వ్యక్తీ అని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, రైతు నాయకులు లోకరీ పోశెట్టి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మంజుల, ఐద్వా జిల్లా అధ్య క్ష , కార్యదర్శులు లంక జమున, కోవే శకుంతల, నాయకురాలు పొచ్చక్క, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు అగ్గిమల్ల స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సురేందర్ పాల్గొన్నారు .