calender_icon.png 11 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసన చెన్నప్పకు భీమన్న పురస్కారం

11-11-2025 12:39:49 AM

త్యాగరాయ గానసభలో ఘనంగా మహాకవి బోయి భీమన్న జయంతి

ముషీరాబాద్, నవంబర్10 (విజయక్రాంతి): ప్రముఖ సాహితీవేత్త, ‘ఆర్షకవి’, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచా ర్య మసన చెన్నప్పకు భీమన్న పురస్కారాన్ని ప్రదా నం చేశారు. మహాకవి, కళాప్రపూర్ణ, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న 115వ జయంతి వేడుకలు సోమవారం నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. భీమన్న సాహితీ నిధి, సాంస్కృతిక సం ఘ సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా, 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక భీమన్న పురస్కారాన్ని మసన చెన్నప్పకు ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.25,000- నగదు పారితోషికాన్ని, జ్ఞాపికను భీమన్న సతీమణి హైమవతీ భీమన్న అందజేశారు. రాష్ర్ట సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డాక్టర్ వెలు దండ నిత్యానందరావు మాట్లాడుతూ బోయి భీమన్న తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా దళిత సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు..

ప్ర ముఖ నృత్య గురువు డాక్టర్ వట్టికోట యాదగిరి ఆచార్య భావనాలయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.  ప్రము ఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య టి.గౌరీశంకర్, సిటీ కాలేజ్ తెలుగు శాఖాధిపతి  డాక్టర్ కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.