టైటానిక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ హయగ్రీవ చారి గ్రౌండ్లో ఏర్పాటుచేసిన టైటానిక్ షిప్ బిగ్ ఎగ్జిబిషన్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రావుల కోమల కిషన్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత అద్భుతంగా సెట్ వేశారని, టైటానిక్ షిప్ వలె పోలిన ఎగ్జిబిషన్ సెట్ ను చూసి ఆశ్చర్యంగా ఉందన్నారు.
వేసవిలో పిల్లలు, పెద్దలు ఆహల్లాదంగా సేద తీరేందుకు అనుగుణంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.ఈ ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, స్టాల్స్ ఏర్పాటను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, అబూబకర్, కాంగ్రెస్ నాయకులు తోట పవన్, నిర్వాహకులు ఫిరోజ్, అప్రోస్, తదితరులు పాల్గొన్నారు.






