28 April, 2026 | 10:02 PM

మానసిక ప్రశాంతతకు యోగ ఒక్కటే సరైన మార్గం

28-04-2026 08:33 PM

మదర్ తెరిసా కాలనీలో అవగాహన సదస్సు

జవహర్ నగర్,(విజయక్రాంతి): నేటి యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక్కటే సరైన మార్గమని, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సేవా పరమో ధర్మ ఫౌండేషన్ ప్రతినిధులు, రాజులాల్ ఆర్గనైజింగ్, విజయ్ గైక్వాడ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మదర్ తెరిసా కాలనీలో కాలనీ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆధ్వర్యంలో ఫౌండేషన్  సేవా పరమో ధర్మ ఫౌండేషన్ యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన సదస్సు అనంతరం ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. కాలనీలోని పేదలకు, చిన్నారులకు పండ్లు దుస్తులు పంపిణీ చేశారు.  సామాజిక సేవే లక్ష్యంగా తమ ఫౌండేషన్ పనిచేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య  సేవా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.