01-11-2025 08:13:00 PM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..
బాచారం, గౌరెల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే
అబ్దుల్లాపూర్ మెట్/తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి బాచారం, గౌరెల్లి గ్రామాలలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. అనంతరం మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.
రైతులకు అధికారులు అండగా ఉండి.. న్యాయం చేయాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్తకూర్మ సత్తయ్య, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చామ కృష్ణారెడ్డి, బాటసింగారం సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కొత్త కురుమ సత్తయ్య
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీ క్యాబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, తుర్కయంజాల్ రైతు సేవా సంఘం పాలకవర్గ సభ్యులు కొత్త రాంరెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండ్రు స్వప్న శ్రీనివాస్, బీజేపీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బలదేవరెడ్డి, పలువురు నాయకులు, రైతులు, డీసీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు.